Saturday 7 August 2021

మహామేధావి (వ్యంగ్యం)

 


1 ప్రశ్న

ఆ విమానం ఎందుకు కూలిపోయింది?
2 సమాధానం
సర్, వాతావరణం బాగులేక.
3 మహామేధావి పరిష్కారం
అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగును రద్దు చేయండి.

1 ప్రశ్న
ఆ రైలుఎందుకు పట్టాలు తప్పింది?
2 సమాధానం
సర్, ఎవరిదో విద్రోహచర్యవల్ల.
3 మహామేధావి పరిష్కారం
అయితే మెకానికల్ ఇంజనీరింగును రద్దు చేయండి.

1 ప్రశ్న
హఠాత్తుగా వరదలు ఎందుకు వచ్చాయి?
2 సమాధానం
డ్యాము గేట్లు ఎత్తేయడం వలన
3 మహామేధావి పరిష్కారం
అయితే డ్యాములను కూల్చేసి సివిల్ ఇంజనీరింగును రద్దు చేయండి

1 ప్రశ్న
ఏమయ్యా నిన్న చెప్పాపెట్టకుండా ఎగ్గొట్టేశావు?
2 సమాధానం
చెబుదామంటే నా ఫోను పనిచేయలేదు సార్.
3 మహామేధావి పరిష్కారం
అయితే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థను రద్దు చేసేయండి.

1 ప్రశ్న
కోవిడ్ 19 ఎలా పుట్టింది?
2 సమాధానం
సర్, చైనా ల్యాబుల్లో ప్రయోగాల్లో పుట్టింది.
3 మహామేధావి పరిష్కారం
అయితే ప్రపంచంలో ల్యాబులన్నిటినీ రద్దు చేసేయండి.

1 ప్రశ్న
ఆ రైతులందరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
2 సమాధానం
సర్, వారికి గిట్టుబాటు ధర దొరకలేదట.
3 మహామేధావి పరిష్కారం
నాన్సెన్స్. వ్యవసాయాన్ని రద్దు చేసి పడేయండి.

1 ప్రశ్న
ఆ ఊర్లో వాళ్లందరూ ఎందుకు కొట్టుకు చచ్చారు?
2 సమాధానం
ఆ ఊర్లో ఎన్నికలు జరిగాయి.
3 మహామేధావి పరిష్కారం
నాన్సెన్స్. రాజకీయాలను రాజ్యాంగాన్ని రద్దు చేసేయండి.

1 ప్రశ్న
ఎందుకయ్యా చెక్కు బౌన్సు అయ్యింది?
2 సమాధానం
సర్, సరైన టైముకు నా అకౌంటులో జీతం జమ కాలేదు.
3 మహామేధావి పరిష్కారం
నాన్సెన్స్. బ్యాంకింగ్ వ్యవస్థను రద్దు చేయండి.

1 ప్రశ్న
ఎందుకయ్యా ఈ రోజు ఆఫీసుకు లేటు?
2 సమాధానం
సర్, ఊరంతా వానలు. కాలవలన్నీ పొంగి రోడ్లన్నీ నీళ్లమయం.
3 మహామేధావి పరిష్కారం
నాన్సెన్స్. కాలవలన్నీ పూడ్చేయండి.

1 ప్రశ్న
ఎందుకయ్యా, వారు ఆందోళన చేస్తున్నారు?
2 తలతిక్క సమాధానం
కొడాలి నానీ ఏదో అన్నాడట సార్.
3 మహామేధావి పరిష్కారం
నాన్సెన్స్. హిందూమతం ప్రపంచానికి చాల ప్రమాదకరమైనది. ఇది సమాజాన్ని చీల్చడానికే పుట్టింది. రద్దు చేయండి. అసలు హిందూమతమంటే ఏమనుకున్నాను? చివరకు వాళ్లు సమాజానికి చేటు చేసేవారుగా కనిపిస్తున్నారు. అరే, మైనే క్యా సంఝా, ఔర్ తూ క్యా నికలా?

)))(((

ఇటువంటి మహామేధావులు
సమయానుకూలంగా *నాస్తికావతారమును, *కాంగ్రెసావతారమును, *కమ్యూనిస్టావతారమును, *మానవతావాది అవతారమును మార్చి మార్చి ధరించుచూ ఎత్తుచుందురని,

శ్మశానవైరాగ్యంలాగా, ప్రసూతివైరాగ్యంలాగా వీరిది నెట్ ఫ్లిక్స్ సినిమావైరాగ్యమని,

(వీరికి బెంగళూరు తగలబడినా పరవాలేదు, స్వీడన్ తగలబడినా పరవాలేదు ఆయనవి కాదు కాబట్టి) కాని, కొడాలి నాని మాటలను ఖండించేసరికి యావత్ప్రపంచానికి ఇప్పుడు ఒక ప్రళయం వచ్చినట్టు ఫీలౌతున్నారని,

కాంగ్రెస్ స్కూల్లో చదివిన చదువుల ప్రభావం వలన కాలివేలికి దెబ్బ తగిలితే కంట్లో మందువేయాలంటారని

ఇలా సత్యాన్ని గ్రహించినవారు వారి టార్గెట్ ఏమిటో తెలుసుకున్న తరువాత ఇవేం పరిష్కారమార్గాలురా బాబోయ్ అనుకుని కంగారుపడక నవ్వుకుని వదలివైతురు.

Previously posted here:
https://www.facebook.com/srinivasakrishna.patil/posts/3270147743105883

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...