Just Visit this blog if you feel bored with the world around you. Just leave away this blog if you feel bored with this. Feel free to come and go. A Vana Vihanga (A Wild Bird) does not mind to go anywhere in the forest. Cheer Up!
Friday, 8 December 2023
సురక్షాసూక్తమ్
ఇది కలియుగం.
ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ
నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే స్వయంగా ప్రజలమైన
మనలను శత్రువులుగా భావించి, ఒకవైపు మన శ్రేయస్కాములుగా నటిస్తూ, మరోవైపు మనపై
ప్రత్యక్ష-పరోక్షయుద్ధాలను ప్రకటించి నాశనం చేయడానికి పూనుకున్న కాలమిది.
సనాతనధర్మావలంబకులమైన మనకు ఇది అతి గడ్డుకాలం. మనలో తగినంత ఐకమత్యం నశించింది.
కారణాలు అనేకం. కాలానుగుణంగా మన ఆహారపుటలవాట్లు మారాయి. దానితో పాటు మన జీవనవిధానం
కూడా మన పూర్వికులవలె లేకుండా పోయింది. మనలను నాశనం చేయాలనే వారి మాటలను మనం
వింటున్నా సరే, మనకు అర్థం కాని భాషలో వారు మాట్లాడుతున్నట్లుగా మనం ఎంత ప్రమాదంలో
ఉన్నామో మనకు తెలియడం లేదు. విధర్మీయులందరూ రాజాశ్రయం రాజాభయం పొంది, మన కండ్లముందే
మనవారిని ఎందరినో వివిధరకరకాలుగా హతమారుస్తున్నా, అదేదో మన కలలో జరుగుతోంది
అన్నట్లుగా ఆత్మరక్షణకోసం మనం బలవంతులం కావాలనే స్పృహ మనకు కలగటం లేదు. ఆ
విధర్మీయులు ఒకవైపు మనకు మిత్రులుగా నటిస్తూ మరొకవైపు సంస్కృతిసంప్రదాయాలపై దాడులు
చేయడం మాత్రమే కాదు, మన జీవనమార్గాలను కూడా క్రమంగా మూసివేస్తూ వస్తున్నా మనం అర్థం
చేసుకోకుండా వినోదాలలో కాలం గడిపివేస్తున్నాం. శత్రువును వ్యసనాలలో ముంచి నాశనం
చేయాలనేది ఒక యుద్ధపద్ధతి. వారు ఆ పద్ధతిలో ఆరితేరి మనలను వినాశపుటంచులకు
చేరుస్తున్నప్పటికీ మనలో అసంఖ్యాకులైన జనాలు సెక్యులర్ మద్యపు మత్తులో
జోగుతున్నారు. అర్థం చేసుకున్నవారిలో కొందరు మాత్రం శాయశక్తులా పోరాడుతున్నారు.
వారికి ఆ మత్తును వదిలించి సనాతనజీవనస్రవంతిలోనికి తీసుకువచ్చేందుకు శతధా సహస్రధా
ప్రయత్నిస్తున్నారు. వారి ఋణం తీర్చుకోలేనిది. రామరావణయుద్ధంలో అదృశ్యరూపుడై
ఇంద్రజిత్తు చేసిన భీషణమైన మాయాయుద్ధంలో రామలక్ష్మణులతో సహా సమస్తవానరసైన్యం
సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడు జాంబవంతుడు, "నైరృత, హనుమాన్ వానరశ్రేష్ఠః
ప్రాణాన్ ధారయతే క్వచిత్?" (ఓ విభీషణా, హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా?) అని అడిగాడట.
అప్పుడు విభీషణుడు "అదేమిటి ఆర్యా, రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా అని అడుగకుండా,
హనుమంతుని క్షేమం గూర్చి అడుగుతున్నారే?" అని ప్రశ్నించాడట. అప్పుడు జాంబవంతుడు,
"తస్మిన్ జీవతి వీరే తు హతమప్యహతం బలమ్। హనుమత్యుజ్ఝితప్రాణే జీవన్తోఽపి వయం హతాః।।
[[నాయనా విభీషణా, వీరహనుమాన్ ఒక్కడు ప్రాణంతో ఉంటే మన సమస్తవానరసైన్యం
హతమారిపోయినా, బ్రతికివున్నట్లే, ఆ హనుమంతుడు ఒక్కడు లేకుంటే సమస్తవానరసైన్యం
పేరుకు జీవించివున్నా మరణించినట్లే]]" అని బదులిచ్చాడు. ఈ సందర్భంలో, ఆత్మరక్షణకోసం
ఎవరికి సాధ్యమైన రీతిలో వారు పోరాడాలనే మనలోని స్వభావమే ఆ హనుమంతుడు. ఆ స్వభావం
నశిస్తే మనం నశించినట్లే. అది సజీవంగా ఉన్నంతవరకు, మనము, మన ధర్మము సురక్షితంగా
ఉన్నట్లే. ధర్మో రక్షతి రక్షితః. మనం ఆస్తికులం. అంటే వేదవాక్కులను విశ్వసించేవారం.
మన రక్షణకోసం వేదంలోని సురక్షా సూక్తాన్ని అర్థసహితంగా ప్రతిదినం పఠించుదాం.
ఆహుతులను ఎలా సమర్పించాలో ఎవరికివారు తమ తమ గురువులను అడిగి తెలుసుకుంటే
బాగుంటుంది. మన శక్తి, మన పోరాటం, ఎంత గొప్పవైనా వేదమాత ఆశీస్సులను కూడా పొందుదాం.
ఇదిగో ఆ సురక్షా సూక్తం. ఇది చదివేేందుకు చాల సరళమైనది. కఠినమైన పదాలు లేనిది.
పరిమాణంలో చాల చిన్నది కూడా. ((())) సురక్షాసూక్తము (అథర్వవేదము, ద్వితీయకాండము,
16వ సూక్తము) ఋషి - బ్రహ్మ దేవత - ప్రాణము, అపానము, ఆయువు ఛందస్సు - ఏకపాదాసురీ
త్రిష్టుప్ (1,3) ఏకపాదాసురీ ఉష్ణిక్ (2) ద్విపాదాసురీ గాయత్రీ (4,5) 1 ప్రాణాపానౌ
మృత్యోర్మా పాతం స్వాహా।। {{ఓ ప్రాణ-అపానములారా, మీరిరువురు మమ్ములను మృత్యువునుండి
కాపాడండి. మా ఆహుతిని స్వీకరించండి.}} 2 ద్యావాపృథివీ ఉపశ్రుత్యా మా పాతం స్వాహా।।
{{ఓ ద్యావా-పృథివీ, మీరిరువురు మాకు చక్కని వినికిడి శక్తిని ప్రసాదించి మమ్ములను
కాపాడండి. మా ఆహుతిని స్వీకరించండి.}} 3 సూర్య చక్షుషా మా పాహి స్వాహా।। {{ఓ
సూర్యదేవా, మాకు చక్కగా చూడగల శక్తిని ప్రసాదించి మమ్ములను కాపాడు. మా ఆహుతిని
స్వీకరించు.}} 4 అగ్నే వైశ్వానర విశ్వైర్మా దేవైః పాహి స్వాహా।। {{ఓ
వైశ్వానర-అగ్నిదేవ, నీవు సమస్తదేవతలతో కలసి మమ్ములను కాపాడు. మా ఆహుతిని
స్వీకరించు.}} 5 విశ్వంభర విశ్వేన మా భరసా పాహి స్వాహా।।
{{సమస్త-స్థావరజంగమ-పోషకుడవైన ఓ విశ్వంభరదేవా, నీవు నీ సమస్తశక్తితో మమ్ములను
కాపాడు. మా ఆహుతిని స్వీకరించు.}} )))((( కార్తికకృష్ణద్వాదశీ, శోభకృత్, మందవాసరః
Subscribe to:
Post Comments (Atom)
సురక్షాసూక్తమ్
ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...
-
అవ్యాజమైన ప్రేమ? అదేమిటి? అలాంటిది ఎక్కడైనా ఉంటుందా? వ్యాజము అంటే కారణం లేదా సాకు. నిష్కారణంగా మనం ఎవరినైనా ప్రేమిస్తామా? అనగా అనగా య...
-
The following aspects are natural. Means, these are possessed by few people by birth; by instinct, but not by any kind of practice or exe...
-
व्यवहारमातृकाप्रकरणम् Duty of the King: The King must be free from anger and greed. He should attend the court along with scholar...
No comments:
Post a Comment