Sunday 17 May 2020

ಕಾಡಬೇಡಿ ನೋಡಿಯಾರು ನಮ್ಮೋರು


కన్నడభాషలో జనప్రియమైన ఈ పాటను పూర్తిగా వింటూ చూసి ఆనందించండి. కాని, 3:05 నుండి కాసేపు జాగ్రత్తగా వినండి. అక్కడ నాయిక నాయకుడితో ఒక మాట అంటుంది.

"ಕಾಡಬೇಡಿ ನೋಡಿಯಾರು ನನ್ನೋರು"
"కాడబేడి నోడియారు నన్నోరు" అంటుంది.
"ఇలా ప్రాధేయపడకు లేదా వేధించకు, మావారు చూస్తారు" అంటుంది.
అది వినగానే నాయకుడు ఉలిక్కిపడతాడు. జంకుతాడు. ఒక్కసారిగా వెనక్కు తగ్గిపోతాడు. "మావారు" అనే మాట అతనిని అంతగా కంగారు పెట్టింది.
"మావారు అంటే ఆ నాయిక భర్త కాబోలు, ఈమెకు పెళ్లైందేమో, ఈమె వివాహిత కాబోలు, అయ్యో నేను పాపం చేస్తున్నాను" అని భయపడ్డాడు.
కాని, అతడు అపార్థం చేసుకున్న విషయాన్ని నాయిక వెంటనే గ్రహించింది. ನನ್ನ ಹಿರಿಯೋರು - నన్న హిరియోరు - మావారు అంటే మా పెద్దవారు అని స్పష్టం చేసింది.
ఆ విధంగా తనకు పెళ్లి కాలేదని సూచించింది. అయినప్పటికీ, పెద్దవారు అనే మాట అన్నదంటే నీవు ఇట్లా నన్ను వేధించకు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే వెళ్లి మా పెద్దవాళ్ల అనుమతి తీసుకో అని అన్యాపదేశం చేసిందన్నమాట.
మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్ ।
ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పణ్డితః।।

తల్లిని గౌరవించినట్లు ఇతరుల భార్యను గౌరవించాలి. ఇతరుల సొమ్మును మట్టిబెడ్డ మాదిరిగా ఆశించరాదు. తనను తాను ఎలా ప్రేమిస్తాడో ఇతరులను కూడా అలా ప్రేమించాలి. పండితుడంటే అతడే అని మన పెద్దలు చెప్పిన మాట.
ఈ లక్షణాల ప్రకారం నాయకుడు పండితుడే కదా.
అంతే కాదు, తనను పెండ్లి చేసుకొమ్మని నాయికను నాయకుడు అడిగినపుడు మా పెద్దలనడిగి వారి అనుమతితో నన్ను పెండ్లి చేసుకో అని చెప్పడం నాయికల పద్ధతి.
శివుని భర్తగా కోరి అంత పెద్ద తపస్సును చేసిన పార్వతి కూడా శివుడు తన ఎదుటకు వచ్చి కోరిన వరమిచ్చేందుకు నిలబడినప్పుడు నువు నా తల్లిదండ్రుల అనుమతితో నన్ను వివాహం చేసుకోమని వరం కోరింది. (కుమారసంభవం)
తనను పెండ్లి చేసుకొమ్మని సంవరుణుడు ప్రాధేయపడినపుడు తపతి కూడా నా తండ్రి అనుమతిని తీసుకుని నన్ను పెండ్లాడు అన్నది. (మహాభారతం)
యుక్తవయస్కులైన నాయికానాయకుల నడుమ పరస్పరాకర్షణ కలగడం సహజమే. కాని, సంప్రదాయానికి కట్టుబడినపుడు వారి నడుమ నెలకొనే బంధం ధర్మమౌతుంది. వారి సంతానం ధర్మసంతానమౌతుంది.
(క్షత్రియులకు గాంధర్వవివాహం రాక్షసవివాహం కూడా ధర్మబద్ధాలే)
ఈ పాటను వ్రాసింది
ఉదయశంకర్
పాడింది
పి.బి.శ్రీనివాస్, యస్.జానకి
సంగీతం
జి.కె.వెంకటేష్

సినిమా
బూతయ్యన మగ అయ్యు

No comments:

Post a Comment

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...