Showing posts with label Defence. Show all posts
Showing posts with label Defence. Show all posts

Tuesday, 16 March 2021

"అమృత సంచార్"


ద్విజులకు ఉపనయనం అనే సంస్కారం ఒకటి ఉన్నట్లుగానే అమృతసంచార్ అనేది సిక్ఖులకు చెందిన ఒక సంస్కారం. ఆ సంస్కారం రావడానికి వెనుక ఒక వ్యథాభరితమూ గొప్ప ప్రేరణదాయకమూ అయిన చరిత్ర ఉంది.
మొదటినుండీ కూడా మొగల్ పాలకులు స్థానిక భారతీయుల పట్ల క్రూరమైన వైఖరిని అవలంబించారు. ఇస్లాం మతంలోనికి మారాలని తీవ్రంగా వత్తిడి చేసేవారు. వారు మారకుంటే తీవ్రమైన పన్నులను విధించేవారు. వారు తమ ప్రార్థనా మందిరాలకు పోవాలంటే వారు అధికంగా పన్నులు కట్టవలసి ఉండేది.
హిందువులు బలహీనమైన ప్రాంతాలలో హిందూ స్త్రీలను అపహరించి తమ దాసీలుగా మార్చుకునేవారు. హిందూ యువకులను బలవంతంగా నపుంసకులుగా మార్చి, బానిసలుగా దూరదేశాలలో అమ్మేసేవారు.
ఈ అత్యాచారాలను అరికట్టే మార్గం చూపమని భారతీయులు గురునానక్ శిష్యులను (శిష్య అనే పదమే సిక్ఖు అని పలుకబడింది) ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన మొగల్ దర్బారు సిక్ఖుగురువుల పట్ల వైరం వహించింది. తరతరాలపాటు వారిని చిత్రహింసలపాలు చేసింది. (సిక్ఖుగురువుల చరిత్రను చదివితే మనకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి.)
ఇలా శతాబ్దాల పాటు అహింస శాంతి అనుకుంటూ అన్ని రకాల చిత్రహింసలనూ అనుభవించిన హిందూ సమాజం, దెబ్బకు దెబ్బ తీయకుంటే మనం మనుగడ కొనసాగించడం కష్టం అని భావించింది.
మొగలులు హిందువులపై చేస్తున్న అత్యాచారాలను అరికట్టడానికి ఒక సైన్యాన్ని తయారు చేయవలసిందేనని గురు గోవిందుడు సంకల్పించాడు. 1699వ సంవత్సరంలో, వైశాఖి పండుగనాడు, ఆనందపూర్ సాహిబ్ లో ఖల్సా పంథ్ ను ప్రకటించాడు.
గురుగోవిందుడు వేలాది హిందువుల ముందు కత్తి దూసి, మొగలుల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు మొదటగా రక్తతర్పణం చేయగోరుతున్నాను. నరబలి ఇవ్వాలి. అందుకు సిద్ధపడే ఒక వ్యక్తి ముందుకు రండి అని ఎలుగెత్తి పిలిచాడు.
ఎవరూ సాహసించారు కారు. కాని, మూడుసార్లు అలా పిలిచేసరికి దయారామ్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. గురు గోవిందుడు, సంతోషించి అతడి భుజాలమీద చేతులు వేసి డేరా లోనికి తీసుకుపోయాడు. కాసేపటి తరువాత రక్తం కారుతున్న కత్తితో బయటకు వచ్చి, ఒకరి రక్తతర్పణం చాలలేదు, మరొకరు కావాలి అన్నాడు. అప్పుడు మరొక యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. గురు గోవిందుడు అతనిని కూడా డేరా లోనికి తీసుకుపోయి, మరలా బయటకు వచ్చి, ఇతడు రక్తతర్పణం చేసినా చాలలేదు. మరొకరు కావాలి అన్నాడు. అప్పుడు మరొక యువకుడు వచ్చాడు. అలా మొత్తం గురు గోవిందుడు ఐదు సార్లు పిలిచి ఐదుగురు యువకులను డేరా లోనికి తీసుకుపోయాడు. చివరకు గురు గోవిందునితో పాటు ఆ ఐదుగురు యువకులు కూడా డేరానుండి క్షేమంగా బయటకు వచ్చారు. వారిని డేరాలో గురుగోవిందుడు కత్తితో నరికి బలి ఇచ్చి ఉంటాడు అని భావిస్తూ ఉన్న ప్రజలందరూ వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు.
అపుడు గురు గోవిందుడు చిరునవ్వు నవ్వి, హిందువులలో నిస్స్వార్థంగా ఆత్మార్పణ చేయగలిగినవారుంటేనే హిందూసమాజానికి నిజంగా విముక్తి లభిస్తుంది. లేకుంటే కసాయివాని ఎదుట తలవంచి నిలబడే గొఱ్ఱెలలాగా యావత్ హిందూసమాజం నశించిపోవలసిందే. అందువల్ల, అటువంటి వీరులు అసలెవరైనా మనలో ఉన్నారా అని తెలులుకొనేందుకు ఇలా పరీక్షించాను.
ఇదుగో, సింహాలవంటి ఈ ఐదుగురు వీరయువకులు ముందుకు వచ్చారు. నేటినుండి వీరు సింహాలుగా (సింగ్ అనే పేరిట) పిలువబడతారు అని ప్రకటించాడు.
ఆ యువకుల పేర్లు (సింగ్ అనే బిరుదాన్ని చివర తగిలించుకున్న తరువాత) –
1 భాయి దయా సింగ్,
2 భాయి ముఖం సింగ్,
3 భాయి సాహిబ్ సింగ్,
4 భాయి ధరమ్ సింగ్,
5 భాయి హిమ్మత్ సింగ్
(వీరు గురు గోవిందునికి చాల ప్రియమైన వారు కాబట్టి, వారికి పాంచ్ ప్యారే అని వ్యవహారం.)



వీరందరూ తమ తమ అనుచరులతో పాటు పంచ కకారాలను ధరించి హిందువుల మీద అత్యాచారాలకు పూనుకునే మొగలాయీసైన్యాలను ఎదిరిస్తారు. వారి దౌర్జన్యాలను అరి కడతారు.
పంచ కకారాలంటే –
1 కేశ్ (కత్తిరింపబడని పొడుగాటి జుట్టు)
2 కంకత్ (జుట్టును పరిశుభ్రం చేసుకొనేందుకు తగిన చెక్క దువ్వెన)
3 కర లేదా కంకన్ (కంకణం)
4 కచెరా (నూలువస్త్రం)
5 కృపాన్ (కృపాణము అంటే రెండువైపులా పదును కలిగిన కత్తి)
ఈ సంఘటన తరువాత ప్రతి హిందు కుటుంబం తమ సంతానంలో జ్యేష్ఠపుత్రునికి అమృతసంచార్ సంస్కారాన్ని కలుగజేసి, ఖల్సాకు (సంరక్షకసైన్యానికి) పంపసాగారు. ఆ సంస్కారం పొందిన ప్రతి వ్యక్తీ సింగ్ అని పిలువబడతారు.
అమృతసంచారసంస్కారం పొందిన ప్రతివ్యక్తీ గురువిధేయుడై భగవంతుని పట్ల, గురు గ్రంథ్ సాహిబ్ పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి తన జీవితాన్ని ధర్మసంరక్షణకు, ప్రజాసంరక్షణకు, ఆత్మవిముక్తికి అంకితం చేస్తాననే ప్రతిజ్ఞను స్వీకరిస్తాడు. క్షత్రియధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయటమే కాక, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని గడపటం కూడా వారి ఆశయాలు.
అటువంటి సింగులను వివాహం చేసుకున్న యువతికి కౌర్ అనే బిరుదం వస్తుంది. కౌర్ అంటే యువరాణి.
)))(((
ఈ రోజులలో మరలా గోవిందునివంటి గురువులు మరలా అవసరమనిపిస్తున్నారు. గురుగోవిందులు వస్తే వారి మాటలకు మరలా హిందువులలో సింహాలు జూలు విదిల్చి బయటకు వస్తాయి.

Thursday, 19 March 2020

స్వీయరక్షణ


ప్రతి పాఠశాలకూ మూడు ఎకరాల భూమి ఉండాలి. ఒక ఎకరంలో పాఠశాల భవనాలూ, తోట ఉండాలి. మరొక ఎకరంలో క్రీడాంగణం ఉండాలి. ఈ రెండు ఎకరాల చుట్టూ సజీవమైన కంచెను వేయాలి. మరొక ఎకరం భూమిని చుట్టూ కంచె లేకుండా వదిలివేయాలి.

రక్షణకోసం కంచెలేని ఆ ఎకరం భూమి సరిహద్దులను విద్యార్థులందరికీ ప్రతిసంవత్సరం చూపాలి. ఇదంతా మనదే మనదే అని బుర్రకెక్కేలా చెప్పాలి. విద్యార్థులు మూడునెలలకొకసారి ఆ భూమిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎవరికీ ఎటువంటి ఫంక్షన్లకూ అద్దెకివ్వరాదు. అయ్యప్ప స్వాములు కావచ్చు, రంజాన్ ప్రార్థనలు కావచ్చు, రాజకీయనాయకుల మీటింగులు కావచ్చు, ఎగ్జిబిషన్‌లు కావచ్చు, తిరణాళ్లు కావచ్చు, పాఠశాల పిల్లలకు ఐసుక్రీములు, షరబత్తులు అమ్మేవారిని కూడా అక్కడ ఉండనివ్వరాదు. ఎటువంటి కార్యకలాపాలైనా అక్కడ జరగడానికి అవకాశం ఇవ్వరాదు. పాఠశాల విద్యార్థులతో సహా ఎవ్వరూ అక్కడ ఆడుకొనేందుకు కూడా అనుమతిని ఇవ్వరాదు. అలాగని కంచె వేయరాదు, ఇది మా స్థలమే అని బోర్డు కూడా పెట్టరాదు.

ఆ కంచె లేని భూభాగంలో జరుగుతున్న మార్పులు, చేర్పులు, పాఠశాలలోని ప్రతి క్లాసు లీడరు ప్రతిరోజు గమనిస్తూ, వాటిని ఒక ప్రత్యేకమైన నోట్‌బుక్‌లో రాసుకుంటూ ఉండాలి. తమ తమ క్లాసులోని పిల్లలకు వారానికొకరోజు వివరిస్తూ ఉండాలి.

బయటి వ్యక్తి ఎవరైనా ఆ భూభాగంలో ప్రవేశించి, ఒకటి రెండు రోజులు తిష్ఠవేసినట్టనిపిస్తే, (బిచ్చగాడైనా సరే) క్లాసు లీడర్లందరూ కలిసి వెళ్లి అతడిని ఆ భూభాగం బయటకు వెళ్లిపొమ్మని చెప్పాలి. ఒకరిద్దరు వ్యక్తులు కాకుండా కొంతమంది వ్యక్తులు ప్రవేశించి తిష్ఠవేస్తే మొత్తం పాఠశాల విద్యార్థులందరూ కలిసి వెళ్లి, ఇది మా పాఠశాలకు చెందిన భూమి, ఖాళీ చేసి వెళ్లిపొమ్మని చెప్పాలి. (అధ్యాపకులు వారికి రక్షణగా వెనుకనే మౌనంగా నిలబడాలి. పరిస్థితులు తీవ్రమైతే పోలీసు సహాయం కోరాలి.).

ఆ సందర్భంగా ఆక్రమింపజూసిన వారిని సమర్థించే అదృశ్యశక్తులను గూర్చి విద్యార్థులు తెలుసుకుంటారు. కంచె లేకపోవడం బోర్డు లేకపోవడం అనేది బాధ్యతారాహిత్యం కాబట్టి... అని తప్పును ఎత్తిచూపే మాటలను వింటారు. తప్పు ఆక్రమణదారులదే అయినా తమ మీద వచ్చే వత్తిడులు ఎలా ఉంటాయో అవగతం చేసుకుంటారు. మానవత్వమూ మానవహక్కులూ అనే పేరిట జరిగే రకరకాల వాదోపవాదాలు చిన్నప్పుడే వారి చెవులబడాలి. వాటిలోని ఔచిత్యానౌచిత్యాలు క్రమంగా వారికే అర్థమౌతాయి.

ప్రతి పాఠశాలవిద్యార్థులకూ ఇటువంటి శిక్షణ ఇవ్వాలి. అప్పుడే ఆ కాబోయే పౌరులకు తమదైన భూభాగాన్ని రక్షించుకొనడం ఎంత కష్టమో, అయినప్పటికీ దాన్ని కాపాడుకొనడం ఎలాగో తెలుస్తుంది. తాము ఒంటరిగా కాకుండా సమైక్యంగా పోరాడడం వలన తమ శక్తిసామర్థ్యాలను తెలుసుకుంటారు. ఆటంకాలను అధిగమించే మెలకువలను తెలుసుకుంటారు. పౌరులైన తరువాత, పాఠశాల భూమిని రక్షించుకున్నట్లే తమ దేశభూభాగాన్ని కూడా రక్షించుకుంటారు.

జనాభా విచ్చలవిడిగా పెరగడం వల్లనే ఇతరుల సొమ్ము మీద, ఇతరుల భూభాగం మీద ఆక్రమణలు జరుగుతాయనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటారు.

బహుభార్యాత్వాన్ని నిరసిస్తారు. ఇద్దరిని మించి సంతానాన్ని కనరాదని తెలుసుకుంటారు. కొందరి కోసం అందరూ బాధపడరాదని అర్థం చేసుకుంటారు.

ఒక దేశంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండవలసిన తత్క్షణావసరాన్ని గుర్తిస్తారు.

సురక్షాసూక్తమ్

ఇది కలియుగం. ధర్మం మూడుపాదాలను (75%) కోల్పోయి కేవలం ఒకే పాదం (25%) మీద కుంటుతూ నడుస్తూ ఉంటుందని స్మృతివచనం. విధర్మీయులు మనకు పాలకులై, వారే...