ప్లాస్టిక్ సంచులు వద్దు అని ఎందుకు చెప్పాలి?
*శిలాజ ఇంధనాల నుండి తయారవుతుంది.
*పర్యావరణ కాలుష్యానికి కారణమౌతుంది.
*పర్యావరణంలో కలిసిపోయి సమస్యాత్మకంగా తయారౌతుంది.
*వన్యప్రాణులను చంపుతుంది.
*మనుషుల ఆరోగ్యానికి హానికరం.
*రీసైకిల్ చేయడం అంత సులభం కాదు.
*శుభ్రపరచడానికి అధిక ఖర్చులు.
*మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
*పర్యావరణ కాలుష్యానికి కారణమౌతుంది.
*పర్యావరణంలో కలిసిపోయి సమస్యాత్మకంగా తయారౌతుంది.
*వన్యప్రాణులను చంపుతుంది.
*మనుషుల ఆరోగ్యానికి హానికరం.
*రీసైకిల్ చేయడం అంత సులభం కాదు.
*శుభ్రపరచడానికి అధిక ఖర్చులు.
*మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
ప్లాస్టిక్ సంచులు మనకు మరియు పర్యావరణానికి ఎందుకు చెడ్డవి?
*ప్లాస్టిక్ సంచులు మన భూమిని, నీటిని కలుషితం చేస్తాయి. ప్లాస్టిక్ సంచులు ప్రతిచోటా ఉన్నాయి. చుట్టూ చూడండి. ప్లాస్టిక్ సంచులు చాలా సాధారణమైన చెత్త అని మీరు గమనించవచ్చు. రోడ్ల వెంట చెట్లు మరియు కంచెలలో చిక్కుకొని, నీటిలో తేలుతూ, పార్కుల్లో, అడవుల్లో కూడా నేలమీద పడి ఉంటుంది. చెత్త డబ్బాల చుట్టూ, ఉంటుంది. చాలా తేలికైనవి కాబట్టి, ప్లాస్టిక్ సంచులు గాలిలో తేలికగా కొట్టుకుపోతాయి. గాలి ద్వారా నీటి ద్వారా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ప్రకృతిని కలుషితం చేస్తాయి.
ప్లాస్టిక్ చెత్త అన్ని ప్రాంతాల్లో కూడా గొప్ప సమస్యలను కలిగిస్తుంది. పారవేసిన లక్షలాది ప్లాస్టిక్ సంచులు పట్టణ ప్రాంతాల్లో నీటి పారుదల మార్గాలు మరియు మురుగునీటిని మూసివేస్తాయి. వర్షాలు ప్రారంభమైనప్పుడు, మొదటి కొన్ని నిమిషాల తర్వాత వీధులు నీటితో నిండిపోతాయి. ఎందుకంటే ప్లాస్టిక్ అడ్డు తగలడం వల్ల నీరు మురుగునీటి పైపుల గుండా వెళ్ళదు.
నదులన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయి,
ప్రపంచంలోని కొన్ని నదులపై దాదాపు మీ పాదాలు తడి కాకుండా మీరు నడవగలరు.
ప్రపంచంలోని కొన్ని నదులపై దాదాపు మీ పాదాలు తడి కాకుండా మీరు నడవగలరు.
ప్లాస్టిక్ సంచులు సహజవాతావరణాన్ని మార్చివేయగల స్థితికి చేరుకున్నాయి.
మనం ప్రతిచోటా ప్లాస్టిక్ బ్యాగులు అవసరం లేదని చెప్పవలసి ఉంది. ఇది మన పర్యావరణానికి, మన ఆరోగ్యానికి, ప్రపంచవాతావరణానికి మంచిది. స్టోర్ చెక్ అవుట్ వద్ద ప్రతిసారీ మనము ప్లాస్టిక్ కిరాణా సంచులు వద్దని చెప్పేందుకు ప్రయత్నం చేద్దాం.
ముడి చమురును శుద్ధి చేసేటప్పుడు బయటపడే పదార్థంతోను, సహజ వాయువు ప్రాసెసింగ్ నుండి తీసుకోబడిన పాలిథిలిన్ అనే పదార్ధంతో ఎక్కువ భాగం ప్లాస్టిక్ సంచులను తయారు చేస్తారు. వాటి వెలికితీసేటపుడు అవి గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తాయి, ఇవి ప్రపంచంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులకు కారణమౌతాయి.
ఈ సంచుల ఉత్పత్తికి చాలా శక్తి (energy) అవసరం. ప్రపంచవ్యాప్తంగా, మన ప్రస్తుత చమురు సరఫరాలో 8 నుండి 10 శాతం ప్లాస్టిక్ బ్యాగ్ తయారీకి వెళుతుంది. కేవలం అమెరికాలో మాత్రమే, ప్రతి సంవత్సరం 12 మిలియన్ బారెల్స్ చమురును ప్లాస్టిక్ ఉత్పత్తికి వినియోగిస్తారు. ఖచ్చితంగా చెప్పాలంటే అమెరికాలో ప్రతి సంవత్సరం 100 బిలియన్ల ప్లాస్టిక్ సంచులు తయారవుతున్నాయి. ఇంతటి శక్తిని వెచ్చించి తయారు చేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా, ప్లాస్టిక్ సంచిని కేవలం 12 నిమిషాలు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఒక అంచనా.
ప్రపంచ చమురు నిల్వలు 2050 వరకు మాత్రమే మన అవసరాలను తీర్చడానికి తగినంతగా ఉన్నాయి.
ప్లాస్టిక్ సంచులు ఎప్పుడూ విచ్ఛిన్నం కావు. పెట్రోలియం నుండి ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ సంచులు సింథటిక్ పాలిమర్‌లతో కూడి ఉంటాయి, ఇవి ప్రకృతిలో కలిసిపోయేందుకు 1,000 సంవత్సరాల వరకు పట్టవచ్చు. చాలా సందర్భాలలో ఏమి జరుగుతుందంటే, వాతావరణంలో ఉన్నప్పుడు, అ ప్లాస్టిక్ చిన్న మైక్రోస్కోపిక్ ముక్కలుగా విడిపోతుంది, అవి నేలల్లో నిక్షిప్తం అవుతాయి. మనం ఆహారంలో కలిసి మన శరీరంలో ప్రవేశిస్తాయి. లేదా నీటిలో కలిసి కలుషితం చేస్తాయి.
ఈ ముక్కలు చాలా చిన్నవిగా ఉంటాయి, అవి మన కంటికి కనిపించవు.
ఆసియాఖండ దేశాలు, యుఎస్ తీరప్రాంతాలు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేస్తాయి.
పర్యావరణంలో ఎప్పుడూ విచ్ఛిన్నం కాని కాలుష్య కారకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మన అంచనాలకు మించి చిక్కులు ఉంటాయి.
ఒక అధ్యయనం ప్రకారం, సముద్రతాబేలు మరణాలలో 35 శాతం వరకు ప్లాస్టిక్ తినడం వల్ల సంభవించాయి. ఒక చనిపోయిన పెలికాన్ కడుపు 17 ప్లాస్టిక్ సంచులతో నిండి ఉంది. 25 ప్లాస్టిక్ సంచులు కడుపు నింపడంతో ఆస్ట్రేలియాలో ఒక మొసలి మరణించింది. కడుపులో 8 ప్లాస్టిక్ సంచులు జీర్ణం కాకపోవడం వల్ల ఒక ఆవుదూడ బలవన్మరణానికి గురికావలసి వచ్చింది. ప్లాస్టిక్ ఉత్పత్తిని మానకపోతే, ప్లాస్టిక్ వినియోగాన్ని మానకపోతే, ప్రతిరోజు ఇటువంటి అనారోగ్యకరమైన సమాచారాన్ని మనం మరింత ఎక్కువగా వినవలసి ఉంటుంది.
ఇవన్నీ మనిషికి ముందస్తు సూచనలు. మనిషి తొందరపడి మేల్కొనకపోతే మనిషి కంచం నిండా కూడా తినడానికి ప్లాస్టిక్ వస్తువులే మిగులుతాయి.
మనం వినియోగించే ప్లాస్టిక్ ఈ జంతువుల జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది. పేగులలో చిక్కుబడుతుంది. ఊపిరి ఆడకుండా చేస్తుంది. హృదయవిదారకమైన విషయం ఏమిటంటే, ఆ జంతువులకు ఈ ప్లాస్టిక్ అంటరాని వస్తువని తెలియదు. తినకూడని పదార్ధమని తెలియదు.
ఈ ప్లాస్టిక్ వ్యర్థంలో జంతువులు కూడా సులభంగా చిక్కుకుపోతాయి. ప్లాస్టిక్ సంచులలో పక్షులు పట్టుబడి, ఎగరడానికి చేతకాక, ఆహారం తినలేక చివరికి గొంతు కోసుకుని పోయి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి.
డాల్ఫిన్లు, సీల్స్, పిల్లులు, కుక్కలు, జింకలు, ఇంకా అనేక ఇతర జంతువులను ప్లాస్టిక్ చంపేస్తోంది.
ఈ జంతువుల బాధలను ఊహించుకోండి.
ఈ జంతువుల బాధలను ఊహించుకోండి.
ఆసియా-పసిఫిక్‌లోని పగడపు దిబ్బలపై ఒక అధ్యయనం జరిగింది. పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం పగడపు దిబ్బలను క్రమంగా నాశనం చేసే అంటువ్యాధుల వ్యాప్తిని ప్రోత్సహిస్తాయని నిర్ధారించింది.
ఈ విధంగా, ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపై అపారమైన జీవవైవిధ్యం కలిగిన పర్యావరణ వ్యవస్థల నాశనాన్ని వేగవంతం చేస్తాయి.
కోకాకోలా వంటి శీతల పానీయాలలో, పంపు నీటిలో, సీఫుడ్‌లో కూడా మైక్రోప్లాస్టిక్స్ కనుగొనబడ్డాయి.
ఇది మన ఆహారపు గొలుసును (food chain) కలుషితం చేసింది, కనుక ఇది మన శరీరంలో కూడా చేరుకుంటోంది. మన శరీరంలోని ప్లాస్టిక్ కణాలు పెరిగిన సాంద్రతకు మన జీవక్రియ గతి తప్పుతోంది. సహజమైన రోగనిరోధక శక్తి క్షీణించి పోతోంది.
మన శరీరంలో వ్యాధికారక కణాలను ప్రవేశపెట్టడం ద్వారా ఇది కాలేయంపై ఒత్తిడిని పెంచుతుందని శాస్త్రజ్ఞుల అంచనా. దీనికితోడు, మన జీర్ణవ్యవస్థలోని ప్లాస్టిక్‌లు సరైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన ట్రేస్ ఎలిమెంట్స్ (ఇనుము వంటివి) గ్రహించడాన్ని ప్రభావితం చేస్తాయి.
ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ ఉత్పత్తులు మొత్తంగా మన ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి.
ప్లాస్టిక్ సంచుల రంగును మార్చడానికి జోడించే రంగులు కూడా మన ఆరోగ్యాన్ని దొంగిలిస్తాయి. ఈ రంగులు స్వయంగా విషాన్ని విడుదల చేస్తాయి. సీసం లేదా కాడ్మియం వంటి భారీ లోహాల కణాలతో కలుషితం చేస్తాయి, రెండూ మూత్రపిండాల ఆరోగ్యాన్ని, ఇతర అవయవాల పనితీరును దారుణంగా ప్రభావితం చేస్తాయి.
సముద్రంలో ప్లాస్టిక్ ముక్కలు, పిసిబిలు (పాలిక్లోరినేటెడ్ బైఫెనిల్స్) మరియు పిహెచ్ (పాలిసైక్లిక్ సుగంధ హైడ్రోకార్బన్లు) వంటి కాలుష్య కారకాలను సులభంగా గ్రహించగలవు. ఇవి హార్మోన్లను-భంగపరిచే రసాయనాలు.
ప్లాస్టిక్ సంచులను రీసైకిల్ చేయడం అంత సులభం కాదు.
ప్లాస్టిక్ సంచులు రీసైక్లింగ్ యంత్రాలలో చిక్కుకునే అవకాశం ఉన్నందున, ప్లాస్టిక్ సంచులను పూర్తిగా రీసైకిల్ చేసే సామర్థ్యం యంత్రాలకు లేదు. అందువల్ల అన్నిచోట్ల వాటిని అంగీకరించటం లేదు. వాటిని రీసైక్లింగ్ ప్రవాహం నుండి తొలగించడం వల్ల మునిసిపాలిటీలకు సంవత్సరానికి 1 మిలియన్లు ఖర్చవుతాయి.
ప్లాస్టిక్ బ్యాగ్ రీసైక్లింగ్‌కు ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసి కొత్త ఉత్పత్తిగా మార్చగల ప్రత్యేక పరికరాలు అవసరం. కాని, చాలా మునిసిపాలిటీలకు వారి రీసైక్లింగ్‌ను తమ వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమంలో చేర్చడానికి బడ్జెట్ లేదు.
కాబట్టి, ప్లాస్టిక్ బ్యాగ్ రీసైక్లింగ్ సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. రవాణా కూడా బాగా ఖరీదైనది.
ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ సంచుల యొక్క వాస్తవ రీసైక్లింగ్ రేటు 5% నుండి 15% శాతం మధ్య ఉంటుంది. #ఇంగ్లీష్‌మీడియం ఉన్నదనే కారణంగా గొప్పగా అభివృద్ధి చెందిన దేశంగా మనం భావిస్తున్న అమెరికాలో ఇది సంవత్సరానికి కేవలం 1% మాత్రమే.
{మూలం - జీరో ప్లాస్టిక్ కమ్యూనిటీ}
No comments:
Post a Comment